2 April, 2026 | 6:32 PM

ప్రజా పాలనలో ప్రగతి రధ సారధి మంత్రి సీతక్క

02-04-2026 04:13 PM

 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సాంబశివరెడ్డి

మంగపేట, ములుగు జిల్లా,(విజయక్రాంతి): ప్రజా పాలనలో ప్రగతి రథసారథి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. గురువారం ములుగు జిల్లా  మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మంత్రి సీతక్క సారధ్యంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో అభివృద్ధి వెలుగులు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలలో ఇప్పటివరకు తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి, అందించిన పథకాల వివరాలను తెలిపారు.

రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధంగా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తమ గ్రామాభివృద్ధికి కృషి చేసిన మంత్రి సీతక్కకు ప్రజల తరపున సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎట్టి రాంబాబు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పెసా మొబలైజర్ డబ్బుల ముత్యాలరావు, స్థానికులు ధూళిపాల బాలకృష్ణ, కటుకూరి శేషయ్య, లక్కీ వెంకన్న, రాజమల్ల సుకుమార్, షేక్ మోయునుద్దీన్ తదితరులతో పాటు  గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.