2 April, 2026 | 8:11 PM

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళులు

02-04-2026 06:18 PM

ఖమ్మం, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి):  ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పాల్గొని, సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా జనార్ధన్, మూడుముంతల గంగరాజు యాదవ్ వివిధ సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..