2 April, 2026 | 7:50 PM

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి

02-04-2026 06:08 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, గడ్డం ఉప్పలయ్యలు అన్నారు. గురువారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.

సర్దార్‌ సర్వాయి పాపాన్నగౌడ్‌ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని, దళిత, బహుజనులను ఏకం చేయడానికి ఎంతో కృషి చేసి బహుజన రాజ్యం వైపు నడిపించిన వ్యక్తి పాపన్నగౌడ్‌ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడసంఘంనాయకులుపులుసువెంకటనారాయణ గౌడ్, పులుసు వెంకన్న గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, గుండగాని శ్రీనివాస్ గౌడ్, గుండగాని సుధాకర్ గౌడ్, తునికి నాగరాజు గౌడ్, కట్ల మల్లయ్య, తొట్ల సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.