శివంగాలపల్లి గ్రామ సభలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలపై అవగాహన
02-04-2026 06:06 PM
కోనరావుపేట ఏప్రిల్ 02 (విజయక్రాంతి): శివంగాలపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలపై గ్రామ ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. అలాగే గ్రామ అభివృద్ధి ప్రణాళికపై చర్చిస్తూ, భవిష్యత్ అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు.ఈ గ్రామ సభలో సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించారు.గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను తెలియజేసి, అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు అందించారు.




