2 April, 2026 | 8:16 PM

గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి: సర్పంచ్ విజయశాంతి అప్పారావు

02-04-2026 06:25 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ కార్యక్రమాన్ని సర్పంచ్ విజయశాంతి అప్పారావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, జరిగిన జరగవలసిన అభివృద్ధి గురించి గ్రామ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు గ్రామ పెద్దలు,మహిళలు,అన్ని ప్రభుత్వశాఖలవారు,ప్రజాప్రతినిధులు,మాజీప్రజాప్రతినిధులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.