స్వయం ఉపాదే... స్వావలంబనకు ముందడుగు
స్వశక్తితోనే.... ఏదైనా సాధించగలము.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్.
జవహర్ నగర్,(విజయక్రాంతి): స్వయం ఉపాదే...స్వావలంబనకు ముందడుగని స్వశక్తితోనే ఏదైనా సాధించగలమని జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని గబ్బిలాల పేటలో స్వయం ఉపాధే లక్ష్యంగా వాటర్ ఫిల్టర్ ప్లాంటును గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ యువత ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వశక్తితో వివిధ మార్గాల ద్వారా స్వయం ఉపాధి మార్గాలను వెతుక్కుని స్వశక్తితో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు స్వయంకృషితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గబ్బిలాల పేటలో వేసవికాలం దృష్ట్యా ప్రజల ప్రాథమిక అవసరమైన నీటిని గబ్బిలాల పేటలో తక్కువ ధరకే త్రాగే మంచి నీటిని సరఫరా చేస్తామని, అలాగే దివ్యాంగులకు, గర్భిణీ స్త్రీలకు, తక్కువ ధరలో నీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు మండల సురేందర్, ఆకుల నరసింహ, పందిరి శ్రీనివాసులు, తూటి శ్రీనివాసులు, స్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్ల వినయ్, మాట్ల శ్రీనివాస్, k. శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




