3 September, 2026 | 1:27 PM

"పెద్ద కాకికే దిక్కులేదు.. పిల్ల కాకులు మొరుగుతున్నాయి"

03-09-2026 | 12:54pm

పాలేరు లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే

1000 రోజుల  సంబరాల సభలో మంత్రి పొంగులేటి కామెంట్స్

కూసుమంచి, (విజయక్రాంతి): పెద్ద కాకి, అసలు కాకికే దిక్కులేదు.. పిల్ల కాకులు మొత్తుకుంటున్నాయి.. అరుపులకు, తాటాకు చప్పుళ్ళకు ఎవరు భయపడరు.. ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజల కోసం చేసే నాయకులం అంటూ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కూసుమంచి మండలంలో నిర్వహించిన 1000 రోజుల  ప్రజాపాలన(Congress 1000 Day Rule) సంబరాల లో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన వాళ్లు, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం అని ప్రజల సమస్యలను పట్టించుకోని వారు, ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేక అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలి. గతంలో సాగు నీటి విషయంలో పాలేరు ప్రజలను  మోసం చేసి.. వేరే జిల్లాలకు నీళ్లు తరలించింది ఎవరని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) ను ప్రశ్నించారు.. అసలు కాకి కె దిక్కు లేక ఫామౌజులో పడుకుంటే  పిల్ల కాకులు వచ్చి  ఏదో అరుస్తున్నాయని... మీరెన్ని కుప్పిగంతులు వేసిన మళ్లీ పాలేరులో ఎగిరేది మూడు రంగులు జెండా నే అని ధీమా వ్యక్తం చేశారు