3 September, 2026 | 12:46 PM

పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో

03-09-2026 | 12:27pm

కేసముద్రం (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థుల(Polytechnic students) భవిష్యత్తుకు శాపంగా మారనున్న శక్తి, జీవో 97 రద్దు(Cancellation of GO 97) చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్(Potti Sriramulu Circle) వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే విద్యార్థులకు శాపంగా మారిన జీవో 97, శక్తి కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.