కొండా సురేఖ మంత్రి పదవిపై ఉత్కంఠ.. హైకమాండ్ డెడ్ లైన్
సురేఖ రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు రంగం సిద్ధం
సాయంత్రం లోగా సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి పదవి నుంచి సురేఖను తప్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం(Congress High Command) నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవికి రాజీనామా చేయాలని సురేఖను కోరినట్లు సమాచారం. కొండా సురేఖ రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఢిల్లీ నుంచి రాగానే గవర్నర్ కు సమాచారం ఇచ్చే అవకాశముందని, అయితే రేవంత్ హైదరాబాద్ కు వచ్చే లూపే రాజీనామాకి చాన్స్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
నేనేం తప్పు చేశానని రాజీనామా చేస్తా: మంత్రి కొండా సురేఖ
ఈ అంశంపై మంత్రి కొండాసురేఖ(Konda Surekha) మాట్లాడుతూ... ''నన్ను రాజీనామా చేయమని ఎవరూ చెప్పలేదు. నేనేం తప్పు చేశానని రాజీనామా చేస్తా'' అని మీడియాతో(Minister Konda Surekha's Press Meet) అన్నారు.కొండా సురేఖ ఇంటి దగ్గర నిర్మానుష్యంగా మారింది. ఆమె అనుచరులు వరంగల్ నుంచి హైదరాబాద్(Warangal to Hyderabad) కు రాలేదు. సురేఖ ఇంటి దగ్గర మీడియా తప్ప ఇతరులు కనిపించడం లేదు. భారీగా అనుచరులు వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం. పార్టీ లైన్ మేరకు కొండాకు అనుచరులు దూరం అయ్యారు. అనుచరులతో మీటింగ్ తర్వాతే సురేఖ రాజీనామాకు మొగ్గుచూపారు. అన్ని పరిణామాలపై కొండా దంపతులు గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చే అవకాశముంది.






