15-02-2026 06:47:27 PM
- మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వినోద్
- వేలాదిగా తరలిన భక్తులు
- బుగ్గ జాతర జనసంద్రం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శైవ క్షేత్రాల్లో శివనామ స్మరణ మారుమోగింది. కన్నాల అటవీ ప్రాంతంలో నీ శ్రీ బుగ్గ దేవాలయం లో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు దేవాలయాన్ని చేరుకున్నారు. దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో క్యూలో కనిపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జాతరలో పాల్గొని గర్భగుడిలో శివుడికి పాలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా బుగ్గ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు దేవాలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక అర్చనలు చేసి తీర్చ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేమ్యాలు టెంట్లు వేశారు. దర్శనం కోసం భక్తుల సౌకర్యం భారీకేట్లను ఏర్పాటు చేశారు.
బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ దేవాలయం వద్దనే తిష్ట వేసి బందోబస్తును పర్యవేక్షించారు. దేవాలయం ఆవరణలోనే అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. జాతరకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ నుంచి బుగ్గ దేవయానికి రవాణా సౌకర్యం తో భక్తులు సౌకర్యంగా మా శివరాత్రి వేడుకలకు వెళ్లారు. స్వచ్ఛంద సంస్థలు, భక్తులకు మజ్జిగ, పానీయాలు ఉచితంగా అందజేశారు.
ఇది ఇలా ఉండగా మహా శివరాత్రి వేడుకలు శివాలయంలో ఘనంగా జరిగాయి. బంగ్లా ఏరియా వద్ద ఉన్న శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులు ముఖ్యంగా మహిళలు శివాలయం వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులతో శైవ క్షేత్రం సందడిగా మారింది. టిపిసిసి రాష్ట్ర కమిటీ ప్రచార కన్వీనర్ నాతర స్వామి, సర్పంచ్ నాతరి లక్ష్మి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి మహాశివరాత్రి జాతరలో పాల్గొన్నారు.