calender_icon.png 6 February, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా

06-02-2026 01:41:31 AM

కాకతీయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 5,(విజయక్రాంతి):కే.యులో ఈనెల 7న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రచార పోస్టర్ ను వీసీ ఆచార్య ప్రతాపరెడ్డి, రిజిస్టార్ రామచంద్రం చేతుల మీదుగా ఆవిష్కరించారు.

కేయూ ప్లేస్మెంట్ సెల్, హైదరాబాద్ మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ లో సి.ఐ.ఎస్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉదయం 7:30 నుండి సాయంత్రం 4:30 వరకు మెగా జాబ్ మేళా కేయూ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయ ప్లేస్మెంట్ సెల్ సంచాలకులు డాక్టర్ చిర్రా రాజు తెలిపారు.

జాబ్ మేళాలో 2023, 24, 25, 26  పాస్ అవుట్ విద్యార్థులందరికీ అవకాశం ఉంటుంది అని, ఎంపిక అయిన అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రంలో రాత్రి షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రారంభ వేతనం 15,000 నుండి 20,000 వరకు ఉండనున్నదని, 400 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య బి. సురేష్ లాల్, ఆచార్య రాజేంద్ర కట్ల, ఆచార్య ఎస్. నరసింహ చారి, ఆచార్య మామిడల ఇస్తారి, ఆచార్య వై. వెంకయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్లు డాక్టర్ సంతోష్, బొల్లం కిరణ్, మేజిక్ బస్ ఫౌండేషన్ బాధ్యులు రాకేష్ ల్యాదేల్ల, నందేశ్వర్ పాల్గొన్నారు.