26 April, 2026 | 8:16 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రక్తదానం వెలకట్టని గొప్పది..

18-02-2026 06:45 PM

- మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి 

- జనహిత మేగా రక్తదాన శిబిరం

- 102 యూనిట్ల రక్తం సేకరణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): అన్ని దానాల కంటే రక్తదానం వెలకట్టలేనీ గొప్పదానమని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి అన్నారు. తాపీ సంఘం భవనంలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో చేపట్టిన మెగా రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఈ మెగా రక్తదాన శిబిరం ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుందన్నారు.

రక్తదానం చేయడం వల్ల నిండు ప్రాణాలు కాపాడిన వారు అవుతారన్నారు. జరహిత సేవాసమితి సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు. మెగా రక్తదాన శిబిరం లో 102 యూనిట్ల రక్తం సేకరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి, వైస్ చైర్మన్ రాగంశెట్టి సతీష్ రక్తదాత లకు ప్రశంసా పత్రాలు అందించారు. జనహిత సేవా సమితి యొక్క సేవా కార్యక్రమాలకు మున్సిపల్ కౌన్సిల్ నుంచి ఎల్లవేళలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, సభ్యులు కాసర్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు బండారి స్రవంతి, నిచ్ఛకొల వంశీ,చంద్రవెళ్లి గ్రామ సర్పంచ్ చిలుముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దావ రమేష్, శంకర్ సింగ్, పోలు శ్రీనివాస్, దామెరా శ్రీనివాస్, పీక లక్ష్మణ్, జనహిత సభ్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్ సిబ్బంది,రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.