18 July, 2026 | 12:44 AM

ఎంఈఎఫ్ నేత గజ్జల దయానంద్ మాదిగ

18-07-2026 12:00 AM

కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

ముషీరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాంనగర్ డివిజన్ హరి నగర్ లో ఇటీవల మరణించిన హైదరాబాద్ జిల్లా ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు గజ్జల దయానంద్ మాదిగ కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సందర్శించి పరామర్శించారు.  అనంతరం గజ్జల దయానంద్ మాదిగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గజ్జల దయానంద్ మాదిగ  కుటుంబానికి ఎమ్మార్పీఎస్  అడంగా ఉంటుదని మనోధైర్యం ఇచ్చారు.

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  మాట్లాడుతూ గజ్జల దయానంద్ మాదిగ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా అనేక ఉద్యమాలలో క్రియాశీలకమైన పాత్ర పోషించారన్నారు. వారులేని లోటు ఎమ్మార్పీఎస్  ఉద్యమానికి తీరని లోటు అని, మాదిగ అమరవీరుల త్యాగాలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల రాజశేఖర్, గజ్జల ఈశ్వర్ మాదిగ, ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు చిలక ఎల్లయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గజ్జల సూర్యనారాయణ మాదిగ, గండి కృష్ణ మాదిగ, టీవీ. నరసింహ మాదిగ, ఎమ్మెస్ పి, ఎమ్మార్పీఎస్  హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డప్పు మల్లికార్జున్ మాదిగ,  హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి.

ఇటికే శ్రీకిషన్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుమిట్టపల్లి రవీందర్ మాదిగ, జిన్నారపు శ్యామ్ రావు మాదిగ,సిద్దంగి ప్రసాద్ మాదిగ, కుమ్మరి శ్రీనివాస్ మాదిగ,ఇనుముల అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్  మీడియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లెందులు ఎల్లయ్య మాదిగ, మేకల రాజు మాదిగ, తాండ్ర మురళి మాదిగ, గంగాధరి మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.