నల్లబ్యాడ్జీలతో మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపారు.
గత మూడు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలనీ,ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు కు ప్రభుత్వం పూనుకోవాలని పెద్దపెట్టున ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ ఓం నారాయణ, మంచిర్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ దుర్గ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ కిరణ్, వివిధ శాఖలకు చెందిన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషంట్ కేర్, ఎన్ హెచ్ ఎం ఎంప్లాయిస్104 ఎంప్లాయిస్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.






