3 July, 2026 | 11:37 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి

20-03-2026 02:28 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య శాఖ అధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్యాధికారి రోహిత్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. గర్భిణీలు బాలింతలకు సరైన వైద్య సహాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పల్లె దవాఖానాలు, గ్రామాల్లోని ఆరోగ్యప కేంద్రాల్లో తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.