21 June, 2026 | 11:16 PM

నాపై లీగల్ కేసులు లేవు: మీనాక్షీ నటరాజన్

21-06-2026 03:05 PM

హైదరాబాద్: రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదివారం తెలంగాణ గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. నాపై ఏలాంటి లీగల్ కేసులు లేవని, ఎలక్షన్ కాలమ్స్ లోనూ లీగల్ నోటీసు కాలం లేదని పేర్కొన్నారు. నా సీటు చోరీ జరిగిందని, నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని మీనాక్షీ ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ తిరస్కరణకు గురైనందుకు నాకు నిరాశ లేదు, కానీ బీజేపీ చేస్తున్న కుట్రలు సమాజానికి తెలియజేయాలనే మా పోరాటం అని ఆమె చెప్పారు.

తెలంగాణలోని రాజ్యసభ సీటు నేను తీసుకోలేను అని, నా కోసం మరొకరితో రాజీనామా చేయించి ఆ సీటు నేను తీసుకోలేను అని అన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటా అని, మన్మోహన్, అభిషేక్ సింఘ్వీ లాంటి వారికి వేరే రాష్ట్రాల సీట్లు ఇవ్వాలని మీనాక్షీ నటరాజన్ డిమాండ్ చేశారు. నాలాంటి వాళ్లకు తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాన్ని ఇచ్చేందుకు ఒప్పుకొను అని, నా కేసుల అంశాన్ని కాంగ్రెస్ నేతలు ఇచ్చారనేది పచ్చి అబద్ధం అని, బీజేపీ కావాలనే అబద్ధాలను సృష్టించిందని మండిపడ్డారు.

నేను బాధితుల పక్షం... బాధితురాలికి కూడా నేను అండగా ఉన్నా, బాధితురాలికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ మహిళగా ఆమె వాదన విన్నామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వెల్లడించారు. బాధితురాలి బాధను అర్థం చేసుకొని డీసీసీ అధ్యక్షుడిని తొలగించామని, కేసు ఉన్నంత మాత్రాన నామినేషన్ తిరస్కరణ కాలేదు. బీజేపీ, ఈసీ పూర్తిగా లాలూచీ పడి నా నామినేషన్ తిరస్కరించారని, కేవలం ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాద, నా నామినేషన్ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధం అన్నారు.