2 April, 2026 | 2:57 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

46 డివిజన్‌లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మేయర్

02-04-2026 12:00 AM

ఖమ్మం టౌన్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రూ.29.50 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించబోవు సిమెంట్ రోడ్లు పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ బుధవారం శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని వారికి అందించడమే మంత్రి తుమ్మల ద్యేయం అని అన్నారు. 

స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి మురికి కాల్వలు, సిసి రోడ్ల నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి తుమ్మలకి, మేయర్ కి, కమిషనర్ కి, మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి, ఓబీసీ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, కురుమ సంఘం అధ్యక్షుడు మరాటి రమేష్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కన్నం రమేష్, శాలివాహన సంఘం అధ్యక్షుడు శనిగరం ఉప్పలయ్య, రజక సంఘం అధ్యక్షుడు గోనెల రవిశంకర్ నాయకులు దయ్యాల నాగేశ్వరరావు, కాటం యాదయ్య పాల్గొన్నారు.