1 May, 2026 | 11:37 PM

కార్మికుల కష్టాలు, హక్కుల కోసం పోరాడిన దినం మే డే

01-05-2026 10:12 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల ఫలితమే మే డే! ఈ మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ విశిష్టత, దాని వెనుక ఉన్న చారిత్ర, అని పలువురు కార్మిక సంఘాల సోదరులు విద్యుత్ శాఖ మరియు దినసరి కూలీలు ఎల్లారెడ్డి పట్టణంలోని వారు నిర్వహిస్తున్న విధులు కార్యాలయాల వద్ద మే డే, సందర్భంగా జెండా ఎగరవేశారు. ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి విద్యుత్ ఉద్యోగులు ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శశికాంత్ రెడ్డి మే డే సందర్భంగా జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,

కార్మికులు పడుతున్న కష్టాలను గుర్తించి, హక్కుల కోసం పోరాడిన వారిని స్మరించుకోవడానికి ఈ రోజును కేటాయించారనీ అన్నారు. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం సమయంలో కార్మికులు రోజుకు 15 నుండి 16 గంటల పాటు కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చేది. పని గంటలను రోజుకు 8 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు భారీ నిరసనలు చేపట్టారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు,డి సురేందర్, నూర్య, రాఘవచారి, విట్టల్ రావు, తదితరులు పాల్గొన్నారు.