22 August, 2026 | 4:20 AM

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారీ నిరసన

22-08-2026 01:49 AM
  1. జంతర్‌మంతర్‌కు తరలివచ్చిన ఆందోళనకారులు
  2. రిజర్వేషన్ హటావో ఆందోళన్ ఆధ్వర్యంలో ఉద్యమం
  3. యూజీసీ ఈక్విటీ రూల్స్, రిజర్వేషన్లలో సంస్కరణలు తేవాలి
  4. నూతన యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  5. ముందస్తు చర్యగా పోలీసు, పారమిలిటరీ దళాల మోహరింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ శుక్రవారం ‘రిజర్వేషన్ హటావో’ నినాదాలతో మార్మో గింది. కుల ఆధారిత రిజర్వేషన్లు, యూజీసీ ఈక్విటీ నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది భారీ ఆందోళన చేప ట్టారు. రిజర్వేషన్ కోటా విధానాన్ని ఆర్థిక ప్రాతిపదికకు మార్చాలని, వివాదాస్పద నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఉద్యమం ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్(ఆర్‌హెచ్‌ఏ)’ సంస్థ ఆధ్వర్యంలో పురుడు పోసుకుంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, పెద్ద ఎత్తున నిరసనకారులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా, శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు నిరసన ప్రాంతానికి చేరుకొని భద్రతను కట్టుదిట్టం చేశాయి.

ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ ఢిల్లీ పోలీసులు గురువారమే ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ శుక్రవారం ఉదయం నుంచే చిన్న చిన్న గుంపులుగా ప్రజలు జంతర్ మంతర్ వద్దకు చేరుకో వడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీ సులు జంతర్ మంతర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో విస్తృత ప్రచారం జరగడం వల్లే నిరసనకారులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది.

దాదాపు 5.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఒక సంస్థకు చెందిన అధికారిక పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం రోజు ఒక పోస్టర్‌ను పోస్టు చేసింది. ఆగస్ట్ 21న మధ్యాహ్నం 2 గంటలకు జంతర్ మంతర్ వద్ద జరిగే శాంతియుత నిరసనలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ ఇన్‌స్టా పేజీ ద్వారా ఈ నిరసనకు పిలుపునిచ్చినట్లు తెలిసింది. ఈ పోస్ట్ బాగా వైరల్ కావడంతో ఉదయం నుంచే జనం గుంపులు గుంపు లుగా జంతర్ మంతర్ దగ్గరికి రావడం ప్రారంభించారు.

రిజర్వేషన్ ప్రయోజనాలు వాస్తవంగా అవసరమైన వ్యక్తులకు చేరేలా విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయం, విద్యా అవకాశాలు, స్కాలర్షిప్లు, కోచింగ్ వంటి ప్రయోజనాలకు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరికొంత మంది నిరసనకారులు ఎస్సీ/ఎస్టీ చట్టంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈచట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చట్టంలో మార్పులు చేయాలన్నారు. రిజర్వే షన్లలో ‘క్రీమీ లేయర్’ నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విధానాల్లోనూ మార్పులు చేయాలని కోరారు. 

జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం

ఇటీవల ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన విధానాల్ని అనుసరిస్తూనే రిజర్వేష న్ హటావో ఆందోళన (ఆర్‌హెచ్‌ఏ) వేగ ంగా ప్రసిద్ధి చెందింది. ఈ పేజీ ద్వారానే రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడంతో, పోలీసులు అప్రమత్తమై జంతర్ మంతర్ వద్ద భద్రతను పటిష్టం చేశారు. అయితే సోష ల్ మీడియా ప్రచారంపై పోలీసుల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్ట్ 21న జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్ల సంస్కరణలపై నిరసనకు అనుమతి లభించిం దంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, వీడియోలు అబద్ధమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీ జిల్లా పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత లోని (బీఎన్‌ఎస్ ఎస్) సెక్షన్ 163 ప్రకా రం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు.