6 June, 2026 | 11:07 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

04-06-2026 01:14 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్, జూన్ 3(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

బుధవారం కడ్తాల్ మండలం గోవిందాయిపల్లి తండా సర్పంచ్ జాను రమేష్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుండి కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

నియోజకవర్గానికి ఇప్పటికే మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రెండో విడత కింద అదనంగా మరో 2,500 ఇండ్లు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. అర్హులైన పింఛన్దారులకు త్వరలోనే కొత్త పింఛన్లు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గూడూరు శ్రీనివాసరెడ్డి, నాయకులు నర్సింహ, సింగిల్ విండో డైరెక్టర్ చేకూరి వెంకటేష్, శేఖర్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.