22 April, 2026 | 1:51 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతముల నిర్వహణ

23-01-2026 09:58 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా ఆలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సలహాదారులు శెనిశెట్టి శ్రీనివాస్ పద్మ దంపతుల ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా 108 పీఠలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 108 జంటలు వ్రతంలో పాల్గొని ఆశీస్సులను పొందడం జరిగింది. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శెని శెట్టి శ్రీనివాస్ పద్మ దంపతులకు జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న లు సన్మానించడం జరిగింది.