12 April, 2026 | 11:34 PM

ఒకే రోజులో 108 మారుతి ఇ-విటారా డెలివరీ

12-04-2026 10:09 PM

హైదరాబాద్, ఏప్రిల్ 11, 2026 : మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఒకే రోజులో 108 ఇ-విటారా యూనిట్లను వినియోగదారులకు అందజేయడం ద్వారా తమ ఎలక్ట్రిక్ వాహన ప్రయాణంలో వినూత్నమైన మైలురాయిని నెలకొల్పింది. హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ మొబిలిటీ దిశగా పరివర్తనను వేగవంతం చేస్తున్న దేశంలో,  అతిపెద్ద కార్ల తయారీ సంస్థపై పెరుగుతున్న వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది.

ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మార్కెటింగ్ – సేల్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, కంపెనీ యొక్క ఈవీ లక్ష్యాలలో  హైదరాబాద్ ప్రాముఖ్యతను గుర్తు చేశారు. భారతదేశంలోని ఏ నగరంలో  లేనంత అత్యధికంగా, ఈ నగరంలో 14.5% ఈవీ వినియోగం ఉందని, ఇది ఇ-విటారా యొక్క సామర్థ్యాన్ని గణనీయమైన స్థాయిలో ప్రదర్శించడానికి ఒక ఆదర్శవంతమైన మార్కెట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉందని, తెలంగాణ వ్యాప్తంగా 256 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయని, వాటిలో 119 హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, 2031 నాటికి మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోందన్నారు.