28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

మర్రి సంతోష్ సేవా కార్యక్రమం

24-02-2026 03:44 PM

– అంగన్వాడికి కుర్చీలు, న్యూట్రిషన్ కిట్లు

కోదాడ,(అనంతగిరి): ఖానాపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు మర్రి సంతోష్ సేవా కార్యక్రమాలతో మరోసారి ముందుకు వచ్చారు. గ్రామ అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల కోసం తన సొంత ఖర్చులు రూ.10,000 తో 15 కుర్చీలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం న్యూట్రిషన్ కిట్లను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. చిన్నారుల విద్యాభివృద్ధి, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణకు తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని మర్రి సంతోష్ తెలిపారు.

అంగన్వాడి టీచర్ దేవేంద్ర, ఆయా రవణ మాట్లాడుతూ కేంద్రానికి అవసరమైన సదుపాయాలు కల్పించినందుకు మర్రి సంతోష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ యువకులు, మహిళలు ,సిబ్బంది ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామాభివృద్ధికి మర్రి సంతోష్ ఎల్లప్పుడూ ముందుండాలని వారు ఆకాంక్షించారు.గాదె రామారావు, ఉయ్యాల రాంప్రసాద్, గాదె మహేష్, పూలదాసు రామయ్య, ఐతనబోయిన సురేష్, కంటూ గోపి, కంటూ నరేష్ ,గాదె సైదులు, రెడ్డబోయిన వీరబాబు, గోవింద మహేష్ ,గాదె సైదిబాబు, పిట్టల హరీష్ ఉన్నారు.