11 July, 2026 | 2:05 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

మార్కెట్ చైర్మన్ సైకిల్ సవారీ!

25-11-2025 08:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం సైకిల్ పై సవారీ చేశారు. ఇనుగుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 60 మంది పేద విద్యార్థులకు భూక్యా శోభన్ బాబు ఉచితంగా సైకిళ్లను సమకూర్చి మార్కెట్ చైర్మన్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి శోభన్ బాబుతో కలిసి సైకిల్ పై సవారీ చేసి సందడి చేశారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సమయంలో తమ ఎన్నికల గుర్తు సైకిల్ కావడంతో ఆయన సైకిల్ పై మమకారాన్ని మరోమారు చాటుకున్నారు.