10 March, 2026 | 10:22 PM

1.3 కేజీల గంజాయి పట్టివేత

10-03-2026 08:35 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడ,  పర్వతాపూర్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు కుమ్మరి గోపి వద్ద 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మున్నా అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. నిందితుడిని, గంజాయిని ఘట్ కేసర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్టు అంజిరెడ్డి తెలిపారు.