3 July, 2026 | 11:37 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

హైదరాబాద్ హీరోస్ కెప్టెన్‌గా మాన్యుయెల్ మోరెనో

15-06-2025 01:19 AM

ముషీరాబాద్, జూన్ 14: జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) బరిలో నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టు కెప్టెన్‌గా స్పానిష్ సూపర్ స్టార్ మాన్యుయెల్ మోరెనో నియమితులైనట్లు ఆర్పీఎల్ సంస్థ ప్రతినిధులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అతనికి తోడుగా భారత స్టార్ ఆటగాడు ప్రిన్స్ ఖత్రి, జర్మనీకి చెందిన మాక్స్ రాడిక్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.

ప్రపంచంలోనే మొట్ట మొదటి ఫ్రాంచైజీ ఆధారిత అంతర్జాతీయ రగ్బీ లీగ్ అయిన ఆర్పీఎల్‌లో అంతర్జాతీయ రగ్బీ స్టార్లు దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులతో కలిసి ఆడను న్నారని తెలిపారు. ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఈ లీగ్ ప్రారంభం అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.