23 July, 2026 | 5:11 AM

కోదాడలో మాంగళ్య షాపింగ్ మాల్

23-07-2026 01:30 AM

ప్రారంభించిన సినీ నటి ఆషికా రంగనాథ్

కోదాడ, జాలై 22(విజయక్రాంతి): వస్త్ర రంగంలో వేగంగా విస్తరిస్తున్న మాంగళ్య షా పింగ్ మాల్ కోదాడలో తన 33వ శాఖను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి ఆషికా రంగనాథ్ జ్వోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించగా, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి రిబ్బన్ కట్ చేశారు. సినీ నటి ఆషికా రంగనాథ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సం ఖ్యలో తరలివచ్చారు. మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాష న్ దుస్తులు, వెడ్డింగ్ కలెక్షన్లు అందుబాటు లో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

త్వరలో మరో 10 కొత్త శాఖలు ప్రారంభించి తమిళనాడుకు కూడా విస్తరించనున్నట్లు డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్కుమార్ వెల్లడించారు. కోదాడ ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి మాల్‌ను సందర్శించాలని వారు కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమ వెంకట రత్నంబాబు, వైస్ చైర్‌పర్సన్ మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి తదితరులు  పాల్గొన్నారు.