కోదాడలో మాంగళ్య మెగా లాంచ్
సినీ నటి ఆషికా రంగనాథ్ చేతుల మీదుగా ప్రారంభం
కోదాడ,(విజయక్రాంతి): వస్త్ర రంగంలో వేగంగా విస్తరిస్తున్న మాంగళ్య షాపింగ్ మాల్ కోదాడలో తన 33వ శాఖను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి ఆషికా రంగనాథ్ దీపప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించగా, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే నాలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకట రత్నంబాబు పాల్గొన్నారు.
మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ దుస్తులు, వెడ్డింగ్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. రూ.99 నుంచి రూ.1 లక్ష వరకు వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య, త్వరలో మరో 10 కొత్త శాఖలు ప్రారంభించి తమిళనాడుకు కూడా విస్తరించనున్నట్లు డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ వెల్లడించారు. కోదాడ ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి మాల్‌ను సందర్శించాలని వారు కోరారు.






