కేరళలో కాంగ్రెస్ విజయంపై మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హర్షం
గుండాల,(విజయక్రాంతి): కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు కేరళలో గెలుపు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిలు విస్తృత ప్రచారం నిర్వహించడం ప్రధాన కారణమని ఆయన అన్నారు.
అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంతో కష్టపడ్డారని, ప్రభుత్వం స్థాపించడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని, రానున్న కాలంలో పార్టీ భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉంది కనుక ఏదయినా ప్రభుత్వ శాఖల్లో అర్హులైన వారికి ఏదయినా గౌరవ ప్రథమైన స్థానం కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న కాలంలో దేశం మొత్తం తిరిగి ఒక స్టార్ క్యాంపెనర్గా ఎదుగుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభావం చాలా రాష్ట్రాలలో ఉంటుందని అలాగే రాహుల్ గాంధీకి తోడుగా రేవంత్ రెడ్డి బీజేపీని అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ గెలుపులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు ప్రత్యేక పాత్ర పోషించి ఒక జాతీయ నాయకులుగా ఎదగటం నిజంగా తెలంగాణ ప్రజలందరికి కూడా గర్వంగా ఉందని ఆయన అన్నారు.






