మెదక్ జిల్లాలో ప్రతీకార హత్యలు.. సూరారంలో హైటెన్షన్
మెదక్: వ్యక్తి హత్య, ప్రతీకార హత్యలతో మెదక్ జిల్లా చిన్న శంకరపేట మండలం(Shankarampet Mandal) సూరారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పాత గొడవలతో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. సూరారం వాసి నిన్న చేగుంట మండలం అనంతసాగర్ వద్ద శ్రీధర్ ను చంపాడు.
ప్రభాకర్, స్నేహితులు శ్రీధర్ బైకును వెంబడించి ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. ప్రతీకారంతో ప్రభాకర్ తండ్రి యాదగిరిని శ్రీధర్ బంధువులు హత్య చేశారు. అర్ధరాత్రి మాసాయిపేట మండలం కొప్పులపల్లి శివారులో యాదగిరిని మట్టుపెట్టారు. డాబా వద్ద యాదగిరిని కర్రలతో కొట్టి చంపి ఆటోలో తీసుకెళ్లారు. శ్రీధర్ బంధువులు యాదగిరి మృతదేహాన్ని బండారాయికి కట్టి హల్టీ వాగులో పడేశారు. యాదగిరి మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, శ్రీధర్ మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూరారం గ్రామం, రెండు ఆస్పత్రుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






