29 May, 2026 | 8:31 PM

తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు

29-05-2026 02:42 PM

రాజ్యసభ సీటు కోసం ఇద్దరు ఎస్సీ నేతల ప్రయత్నాలు

ఆ ఇద్దరిలో రాజ్యసభ ఛాన్స్ ఎవరికి..?

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీలో(Telangana BJP) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ సీటు(Rajya Sabha Seat) కోసం ఇద్దరు ఎస్సీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ(Manda krishna madiga), పగిడిపాటి దేవయ్య లాబీయింగ్ చేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం దగ్గర రాజ్యసభ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తెలంగాణ నుంచి అవకాశం లేకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. మందకృష్ణ మోదీకి అత్యంత సన్నిహింతగా ఉంటున్న విషయం తెలిసిందే.  ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ మందకృష్ణను కొనియాడారు.

మందకృష్ణ తన తమ్ముడు అంటూ గతంలో మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వానికి మందకృష్ణ దగ్గరగా ఉంటున్నారు. తనకు రాజ్యసభ ఇవ్వాలని బీజేపీ నాయకత్వంతో లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నేత పగిడిపాటి దేవయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తరుఫున పలుసార్లు దేవయ్య లోక్ సభకు పోటీ చేశారు. పగిడిపాటి దేవయ్య ఆర్థికంగా బలమైన నేతగా ఉన్నారు. బీజేపీ నాయకత్వం(BJP Leadership) నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.