15 March, 2026 | 4:44 AM

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం

15-03-2026 01:35 AM
  1. బలవంతంగా ఎక్కించిన మేనబావ 
  2. పోలీసుల అదుపులో నిందితుడు
  3. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో ఘటన

ఘట్‌కేసర్, మార్చి 14 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపం తో అన్నోజిగూడలో యువతికి బలవంతంగా హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కిం చిన ఘటన కలకలం రేపుతోంది. మనోహర్, బాధిత యువతి వరుసకు బావ, -మరదళ్లు. చిన్నప్పటి నుంచే ఇద్దరికీ పెళ్లి చేయాలని వారి కుటుంబాలు నిర్ణయించాయి.

అయితే మనోహర్ తండ్రి సతీష్ హెచ్‌ఐవీతో మృతిచెందడంతో, యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి మనోహర్‌కు వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో మనోహర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలిం ది. దీంతో మనోహర్‌తో పెళ్లికి బాధిత యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన మనోహర్.. యువతి తల్లిదండ్రు లు ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి యువతికి ఎడమ చేతికి బలవంతంగా ఎయిడ్స్ రక్తం ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యా డు.

అదే రోజు సాయంత్రం యువతికి జ్వ రం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చేతి పై ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నల్లటి మచ్చ కనిపించడంతో కారణం ఏమిటని ప్రశ్నించగా, యువతి జరిగిన విషయాన్ని తల్లిదం డ్రులకు వివరించింది. దీంతో యు వతి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న మోదుచేసి మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతిని మెరుగైన చికి త్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.