7 August, 2026 | 4:56 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

విద్యుత్తు షాక్ తగిలి వ్యక్తి మృతి

06-08-2026 04:26 PM

తూప్రాన్,(విజయక్రాంతి): గురువారం తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామం ఒక వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, నర్సంపల్లి గ్రామస్తుడు జింక నాగార్జున 28, అనే వ్యక్తి పొలం వద్ద నేలపై పడివున్న విద్యుత్ వైరును కరెంటు లేదని భావించి పక్కకు తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తూప్రాన్‌ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నమని ఎస్సై గంగరాజు తెలిపారు.