విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
01-06-2026 09:03 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చౌటిగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు కీసరి నవీన్(32) అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులో ప్లగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాల్వంచకు తరలిస్తుండగా మార్గమధ్యలో నవీన్ మృతి చెందారు.మృతుడికి భార్య కాలిక, కుమార్తె,కుమారుడు ఉన్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






