30 July, 2026 | 5:50 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్

01-06-2026 09:22 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయానికి నూతన కమిషనర్‌గా గోపు గంగాధర్ సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు.గోపు గంగాధర్ గతంలో భీంగల్ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్‌గా విధులు నిర్వహించగా, బదిలీపై బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయానికి కమిషనర్‌గా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పట్టణ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.