నీటి కుండీలో పడి వ్యక్తి మృతి
12-05-2026 12:17 AM
భిక్కనూర్, మే 11 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారిగల్ల బాలరాజు (55) ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న చిన్న నీటి కుండీలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
స్నానం చేసేందుకు ఎల్లమ్మ గుడి వద్దకు వెళ్లిన బాలరాజు, కుండీలోని నీళ్లు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






