బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
12-05-2026 12:18 AM
కోడేరు, మే 11 : మండలంలోని బావాయిపల్లి గ్రామంలో వాగుపై రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం భూమిపూజ చేశారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో గ్రామస్తుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం ఐకేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోడేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు సత్యం, సీనియర్ నాయకుడు నక్క వేణుగోపాల్ యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






