చెరువులో పడి వ్యక్తి మృతి
22-04-2026 03:07 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండాకు చెందిన బానోతు రవీందర్ నాయక్ (38),బుధవారం మేకలు,గొర్రెలను రోజువారీ లాగానే మేత కోసం అవిరేనికుంట తండా సమీపంలో ఉన్న చెరువు దగ్గరకి తీసుకెళ్ళాగా,మేక చెరువులో పడిపోవడంతో దాని తీయడానికి పోయి,చెరువులో మునిగి మృతి చెందారు. మృతుడి కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.






