విద్యుత్ ఘాతంతో మేక మృతి
24-04-2026 04:58 PM
చందంపేట,(విజయక్రాంతి): చందంపేట మండలం బొల్లారంపట్టి గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మేక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గాలి దుమారం కారణంగా మెయిన్ లైన్ వైర్లు తెగి ఉండగా, మేతకు తీసుకెళ్లిన మేకలు వాటిని తాకడంతో ఒక మేక అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందింది. మేకల కాపరి వడ్త్యా భరత్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన తన కంటి ముందే జరిగిందని, మేక విలువ సుమారు రూ.20,000 ఉంటుందని చెప్పారు. స్థానిక సర్పంచ్ నేనావత్ హనుమానాయక్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.ఈ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






