18 August, 2026 | 1:19 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

22-04-2026 12:55 AM

కోనేరు జమ్మలమ్మ ఆలయం వద్ద విషాదం...

అలంపూర్ ఏప్రిల్ 21: కోనేరు జమ్ములమ్మ ఆలయం వద్ద మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.దైవ దర్శనానికి వచ్చిన అలంపూర్ కు చెందిన తెలుగు సురేష్ (36)అనే వ్యక్తి చెట్టుకు టెంటు తాడు కడుతుండగా అక్కడే నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను పక్కకు తీసే క్రమంలో బైరంపల్లి గ్రామానికి చెందిన బోయ స్వాములు అనే వ్యక్తి గేర్ లో ఉన్న ట్రాక్టర్ను స్టార్ట్ చేశాడు.

ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకు రావడంతో అక్కడే చెట్టుకు టెంటు తాడు కడుతున్న సురేష్ ను వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య కూతురు ఉన్నారు.మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు.