చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి
08-06-2026 10:09 PM
శివంపేట,(విజయక్రాంతి): చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగాయపల్లి తండాకు చెందిన గుగులోత్ భిక్షపతి(38) గత 15 ఏళ్లుగా శివ్వంపేట మండలం బోజ్య తాండాలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఎదుల్లాపూర్ శివారులోని తుర్కవాని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






