2 July, 2026 | 4:08 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

12-04-2026 12:00 AM

ముషీరాబాద్,ఏప్రిల్ 11(విజయక్రాంతి): కుటుంబ కలహాలు, మద్యానికి బానిసై ఓ కార్పెంటర్ ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. స్థానికులు,  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ పిఎస్ పరిధి లోని రాంనగర్ శాస్త్రి నగర్‌లో కే. రాజేంద్రప్రసాద్ (35) వృత్తిరీత్యా కార్పెంటర్.

ఆయ నకు భార్య సురేఖ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా రాజేంద్రప్రసాద్ మద్యానికి బానిస అయ్యాడని, శనివారం ఇంట్లో ఎవరు లేని సమయం లో ఫ్యాన్ ఉక్కుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు  వెల్లడిం చారు. సంఘటన స్థలాన్ని ముషీరాబాద్ పోలీసులు, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.