calender_icon.png 9 February, 2026 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

09-02-2026 01:47:18 AM

ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సింగ్ రావు

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సిం గ్ రావు  కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం  సిపిఐ రాజేంద్రనగర్ కార్యాలయం ఏ ఆర్ దేవరాజ్ భవన్ లో జరిగిన గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న అఖిలభారత కార్మిక సంఘాలు,  వ్యవసాయ రైతు సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కన్యగారి నర్సింహారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ రియాజ్, జిల్లా సమితి సభ్యులు ఆనంద్ గౌడ్, మండల పార్టీ సహాయ కార్యదర్శి జె విజయానంద్ గౌడ్,  ఏఐటీయూసీ నాయకులు జి సత్యం,  సదానంద గౌడ్,  సలీం సాబీర్, రామచందర్,  మునేశ్వరి, ఊర్మిళ,  జ్యోతి, బుజ్జి, గంగారం, హుస్సేన్ భాయ్,  ఆంజనేయులు, కొండ య్య, మధు తదితరులు పాల్గొన్నారు.