calender_icon.png 9 February, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

09-02-2026 01:45:48 AM

సిర్పూర్‌లో 10 డిగ్రీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాబోయే రెండు రోజులు రాష్ట్రం లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొమురంభీం ఆసిఫా బాద్ జిల్లా సిర్పూర్‌లో 10 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 10.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.