ఇల్లు, ప్లాట్లు ఇప్పిస్తామంటూ నమ్మించి 43 లక్షల ఘరానా మోసం
- ఫోర్జరీ సంతకాలతో ఫేక్ ప్లాట్ డాక్యుమెంట్ సృష్టి
- విడతల వారీగా సొమ్ము కాజేసిన కేటుగాళ్లు
- ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్.. రిమాండ్
- హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఎల్బీనగర్, ఏప్రిల్ 12 : ఇల్లు, ఓపెన్ ప్లాటు ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ. 43 లక్షలు కాజేసిన ఘరానా మోసగాళ్లను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ పి. నాగరాజ్ గౌడ్ వివరా ల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా.. సంస్థాన్ నారాయణపూర్ మండలం.. పుట్టపాకకు చెందిన అయితరాజు ఆంజనేయులు హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన పెదనాన్న కొడుకు అయితరాజు శంకరయ్య (48) మునగనూరులో నివాసం ఉంటూ.. స్థానికంగా వంటల మాస్టర్‌గా, ప్లాట్ల దందా చేస్తున్నాడు.
2022లో శంకరయ్య.. ఆంజనేయులు వద్దకు వచ్చి కుం ట్లూరులో తక్కువ ధరలో ఇల్లు ఇప్పిస్తానని నమ్మబలికి రూ. 18 లక్షలు తీసుకు న్నాడు. అనంతరం శంకరయ్య స్నేహితుడు కుంట్లూరుకు చెందిన ఆడెపు రాము (32) తో కలిసి వచ్చి.. విడతల వారీగా.. రూ. 23 లక్షలు వసూల్ చేశారు. అనంతరం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ మాయమాటలు చెప్పారు. ఆంజనేయులు ఇదేమి టని శంకరయ్య, రాము లను నిలదీయగా.. ఆ డబ్బును కుంట్లూరు పరిధిలోనే.. వేరే ప్లాట్లలో పెట్టుబడి పెట్టినట్లు అబద్ధాలు చెప్పారు.
వడ్ల మురళి భార్యది ప్లాట్ అని నమ్మబలికి పెండెం శివ, మధుసూదన్ లతో కలిసి ఐదుగురు నకిలీ సంతకాలతో 2 ఫోర్జరీ ప్లాటు అగ్రిమెంట్లు సృష్టించారు. ఆ రెండు ప్లాట్లను రూ.46 లక్షలకు అమ్ముతామని చెప్పి బాధితుడి నుంచి అలా మొత్తం రూ.43 లక్షలు తీసుకున్నారు. ఆ ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారు. బాధితుడు ఈసీ చెక్ చేయగా.. సదరు ప్లాటు కూడా వేరే వారికి అమ్మినట్లు తేలింది.
మోసపోయానని గమనించిన బాధితుడు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్త్స్ర అరుణ్‌కుమార్‌మాట్లాడుతూ.. నిందితులు శంకరయ్య, రాము, ప్లాట్ ఓనర్ వడ్ల మురళితోపాటు మరో కలిసి ముఠాగా ఏర్పడి ఫోర్జరీ పత్రాలు సృష్టించి బాధితుడిని నమ్మకద్రోహం చేసి రూ.43 లక్షలు స్వాహా చేసినట్లు తేలిందన్నారు.
ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు, నారాయణపేట జిల్లా లో వ్యవసాయ భూమిపై పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని చెప్పారు. ఈ మేరకు శంకరయ్య, రామును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు. మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ హెచ్చరించారు.




