మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
20-05-2026 01:16 AM
గాంధారి, మే 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆ సంఘం చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు తమ పంటలను విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రం సిబ్బందికి సూచించారు.. ఈ కార్యక్రమంలో పాక్స్ కార్యదర్శి గాండ్ల సాయిలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు..






