మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
గోపాలపేట ఫిబ్రవరి 1౨ : గోపాలపేట మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయ సమీపంలో ఆదివారం ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్క్ఫె డ్ సహకారంతో వనపర్తి జిల్లా ఉమ్మడి గోపాల్పేట, మండలలా పరిధిలోని రామ్మోహన్ పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తుడి మేఘ రెడ్డి ఆదేశాలనుసారంతో ఘనంగా ప్రారంభించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.రైతులకు న్యాయమైన ధరలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మధ్యవర్తుల ద్వారా రైతులు నష్టపో కుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే పంట ను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.
అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి పక్షాన నిలబడి ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మ డి గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మంద సత్యాశీల రెడ్డి,జిల్లా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు కొంకి వెంకటేష్, వనపర్తి జిల్లా జనరల్ సెక్రెటరీ శివన్న,జిల్లా యూత్ కాంగ్రెస్ ఆర్టిఐ చైర్మెన్ కొంకి రమేష్, తాడిపర్తి సర్పంచ్ లోకా రెడ్డి,కేశంపేట సర్పంచ్ సురేష్ గౌడ్,మాజీ ఎంపిటిసి మేస్త్రి బాలయ్య,శాంతయ్య,సురేష్, బుద్ధారం బోర్డ్క చంద్రయ్య,మండల కాంగ్రె స్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీ ణ్ కుమార్, కొంకాలి వెంకటేష్, శ్రీశైలం,వి విధ గ్రామాల సర్పంచులు,వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మార్క్ఫెడ్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పాక్స్ ప్రతినిధులు,రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




