13 April, 2026 | 1:56 AM

మొక్కజొన్న రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారు

13-04-2026 12:20 AM

అయిజ ఏప్రిల్ 12: అయిజ మునిసిపల్ లోని మార్కెట్ లో మొక్కజొన్న కేంద్రాలను సిపిఎం జిల్లా నాయకులు వివి నరసింహ సందర్శించి మొక్కజొన్నలను పరిశీలించారు. ఈ సందర్బంగా నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అరకొర నామకవాస్తిగా ప్రారంభించి చేతులు దులుపుకున్నదని నేటికీ సక్రమంగా కొనుగోలు చేయక రైతులు మార్కెట్ లోనే జాగరణ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల రైతులు బయట క్వింటాకు 1700 / రూపాయలకు అమ్ముకొoటున్నారని అన్నారు.

కనీసం పెట్టుబడులకు కూడా వచ్చే పరిస్థితి లేదని, కావున ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రైతుల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధర 2400/ రూపాయలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. వ్యవసాయ క్షేత్రంలో రైతుల వివరాలు నమోదు లేకుంటే తక్షణమే నమోదు చేసి వారి ఖాతాలో జమ చేసే విధంగా చూడాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ కార్యక్రమం లో ఈశ్వర్ మండల నాయకులు రాముడు వీరేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.