రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చొరవ చూపాలి
భారతీయ కిసాన్ సoగ్ మండల అధ్యక్షుడు అంజయ్య
భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
కామారెడ్డి,(విజయక్రాంతి): రైతులకు యూరియా ఆన్లైన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని భారతీయ కిసాన్ సంగ్(Bharatiya Kisan Sangh) మండల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి చిన్న అంజయ్య అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ పరిధిలోని టేకిర్యాల గ్రామంలో భారతీయ కిసాన్ సాంగ్ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి మండల అధ్యక్షుడు కోమిరెడ్డి చిన్న అంజయ్య మాట్లాడుతూ రైతులకు యూరియా ఆన్లైన్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు.
వెంటనే ఆన్లైన్ తొలగించాలి. అలాగే మక్కలు కొనుగోళ్ల విషయంలో కూడా ఇప్పటివరకు డబ్బులు రాలేవు అన్నారు,రైతు భరోసా కూడా రాలేదు, వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. వడ్లు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా రైతులు తీసుకోవాలన్నారు. టేక్ రియాల్ గ్రామంలో ఉన్న ఆర్మీ జవాన్లను, ఉత్తమ రైతులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సాంగ్ మండల అధ్యక్షుడు కొమిరెడ్డి చిన్న అంజయ్య , గ్రామ అధ్యక్షుడు కొత్తపల్లి స్వామి, కౌన్సిలర్ లలిత చిట్టిబాబు, సలహాదారులు రమేష్, రాజయ్య, రైతులు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.




