12 April, 2026 | 4:14 AM

ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి

12-04-2026 12:39 AM

టీజీవో అసోసియేషన్, ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహణ

ఖమ్మం, ఏప్రిల్ 11(విజయక్రాంతి):తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో బహుజనులకు ఆశాజ్యోతి, విద్యాప్రదాత, మహాత్మా జ్యోతిరావు ఫూలే 119వ జయంతిని పురస్కరించుకొని శనివారం టీజీవో భవనంలో జయంతి ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొండపల్లి శేషు ప్రసాద్ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికీ పూలమాల వేశారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు విద్య కావాలని కోరుతూ.. అలాగే కుల నిర్మూలన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త. మహారాష్ట్రకు చెందిన ఆయన, భార్య సావిత్రిబాయి పూలే కూడా కలిసి బాలికలకు కూడా  విద్య ఉంటేనే  వారు అన్ని రంగాల్లో ముందుకు పోతారని, మహిళ కోసం మొదటి సారిగా పాఠశాలను స్థాపించి.

‘సత్యశోధక్ సమాజ్’ ఏర్పాటు చేసి, కుల వివక్షకు వ్యతిరేకంగా, సమ సమాజం కోసం నిరంతరం శ్రమించారని వారి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీజీవో కార్యవర్గ సభ్యులు హరీష్, మేకల గోపాలకృష్ణ, ఎన్ శ్రీనివాసరావు, భాస్కర్, భగవాన్ నాయక్, తాజుద్దీన్, ఫణి కుమార్, అంతోటి తిరుపతిరావు, కృష్ణ కిరీటి తదితరులు హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేశారు.